తెలుగు 'బిగ్‌బాస్‌- 2'కి హోస్ట్‌ని ఫైనల్‌ చేశారట!

  • స్టార్ మా టీవీలో తెలుగు బిగ్‌బాస్
  • సీజన్ -1కి వ్యాఖ్యాతగా సినీనటుడు జూ.ఎన్టీఆర్
  • యువనటుడు నానిని సీజన్‌-2కి హోస్ట్‌గా ఖరారు చేసినట్లు సమాచారం
స్టార్ మా టీవీలో ప్రసారమైన తెలుగు బిగ్‌బాస్ సీజన్ -1కి వ్యాఖ్యాతగా సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో బిగ్‌బాస్‌-2 సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశాలు లేకపోవడంతో ఆయన స్థానంలో నేచురల్ స్టార్ నానిని లేక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని తీసుకుంటారని ఇటీవల ప్రచారం జరిగింది. తాజాగా, నేచుర‌ల్ స్టార్ నానినే బిగ్‌బాస్‌ సీజ‌న్ 2కి హోస్ట్‌గా ఫైన‌ల్ చేశార‌ని తెలిసింది.
 
నాని గతంలో పలు వేదికలపై అద్భుతంగా మాట్లాడడమే కాకుండా, ఆయనకు రేడియో జాకీగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. తన హావభావాలతో, డైలాగ్స్ తో నాని బిగ్‌బాస్‌ షోను రక్తికట్టించగలడని ఆ షో నిర్వాహకులు భావిస్తున్నారు. దీంతో సీజన్ -2 లో ఆయననే హోస్ట్‌గా తీసుకోవాలని నిర్వాహకులు భావించి అందుకోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. 
Go Back to Shorts
big boss
Nani
ntr

More Telugu News